![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -641 లో.....అనామిక, రుద్రాణి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. నేను రేపు జరగబోయే బారసాల ఫంక్షన్ కి వచ్చి.. పెద్దబాంబు పేల్చబోతున్న అని అనామిక అంటుంది. ఏంటని రుద్రాణి అడుగగా.. ఇప్పుడు చెప్పను. రేపు నువ్వే చూస్తావ్ కదా అని అనామిక ఫోన్ కట్ చేస్తుంది. ఏం చేస్తే ఏంటిలే ఆస్తులు మాకు రావాలని రుద్రాణి అనుకుంటుంది. మరుసటి రోజు బారసాలకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పు, కావ్యలు ఉయ్యాలా డెకరేషన్ చేస్తుంటారు. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. వాళ్ళతో సరదాగా మాట్లాడుతుంది.
అదంతా చూస్తున్న రుద్రాణి, ధాన్యలక్ష్మి ఓర్వలేకపోతారు. రాహుల్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే.. రాజ్, కళ్యాణ్ లు వస్తారు. ఇప్పుడు నువ్వు ఒక బిడ్డ తండ్రివి అని అనగానే.. అలా ప్రతీసారి నన్ను అంకుల్ అని గుర్తు చేయకండి అని రాహుల్ అంటాడు. ఇక నుండి ఇంతకు ముందులా ఉన్నట్లు ఉంటే కుదరదని రాజ్ అనగానే.. నేను అంత రోమియో ని కాదని రాహుల్ అంటాడు. నువ్వు ఏంత రోమియోవో మాకు తెలుసు గానీ వెళ్లి రెడీ అవ్వమని రాజ్, కళ్యాణ్ అంటారు. ఆ తర్వాత కనకం బారసాల ఫంక్షన్ కి వస్తుంది కనకాన్ని అవమానించాలని రుద్రాణి చూస్తుంది కానీ కనకమే తనని అవమానిస్తుంది. కనకం స్వప్న పాప దగ్గరికెళ్ళి ముద్దాడుతుందే ఇందిరాదేవి వచ్చి.. రండీ టైమ్ అవుతుందని పిలవగానే అందరు ఉయ్యాలా దగ్గరికి వెళ్తారు. ఇందిరాదేవి ఉయ్యాలలో పాపని పడుకోబెట్టి ఆశీర్వదిస్తుంది.
ఆ తర్వాత అనామిక ఎంట్రీ ఇస్తుంది. ఎందుకు వచ్చవంటూ అందరు అడుగుతారు. ఇక్కడున్న అమాయకులానికి మేలుకోల్పడానికి అని అనామిక అంటుంది. కావ్య, రాజ్ లు వెళ్ళమని చెప్తారు. రాజ్ కావ్య లు మీ దగ్గర ఒక పెద్ద విషయం దాచారని అనామిక చెప్తుంది. తరువాయి భాగంలో.. రాజ్, కావ్య వంద కోట్లు అప్పు చేశారు. అప్పు కట్టమని నోటిసులు పంపించారని అనామిక డాకుమెంట్స్ ఇస్తుంది. అది చూసి సుభాష్ షాక్ అవుతాడు. ఎందుకు అప్పు చేశారంటూ అపర్ణ గట్టిగా నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |